నేడు టాటామోటార్స్ నిక్సన్ విద్యుత్తు కారు వివరాలను వెల్లడించింది. ఇది టాటా నుంచి వస్తున్న రెండో విద్యుత్త కారు కావడం విశేషం. అంతకు ముంద టిగోర్ పేరుతో ఒక విద్యుత్తుకారును టాటా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలో సరికొత్త జిపట్రాన్ ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. కారును 2020 జనవరిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ప్రీబుకింగ్స్‌ను రేపటి నుంచి టాటా డీలర్ల వద్ద చేసుకోవచ్చు. రూ.21వేలు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చని కంపెనీ సూచించింది. అసలు ధరను మాత్రం కారు విడుదల సమయంలో వెల్లడించనున్నారు.
ఈ కారులో పర్మినెంట్ మాగ్నెట్ ఏసీ మోటార్‌ను అమర్చారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి ఐపీ67 సర్టిఫికెట్ ఉంది. దీనికి 30.2 కిలోవాట్ల సామర్థ్యం ఉంది. ఒక సారి ఛార్జి చేస్తే 300 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణిస్తుంది.
మెగా ఫ్యామిలీ నిజమైన వారసుడు అల్లు అర్జున్… హీరోలపై మాధవి సంచలన కామెంట్స్