భారతదేశం గర్వించదగ్గ చిత్రం “బాహుబలి-2”. రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రానా, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. “బాహుబలి” చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల వసూళ్ళని రాబట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం విడుదలై మూడేళ్ళు అవుతున్నప్పటికీ, ఆ మేనియా కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యాలో “బాహుబలి-2” చిత్రం సందడి చేస్తుంది. “బాహుబలి 2” చిత్రాన్ని రష్యన్ పాపులర్ టీవీలో రీసెంట్‌గా ప్రదర్శించారు. రష్యన్ డబ్బింగ్ వర్షెన్‌తో ప్రసారమైన ఈ చిత్రం చిన్న క్లిప్‌ని రష్యన్ రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని నటీనటుల నటన రష్యన్ ప్రేక్షకులకి ఎంతగానో నచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు.
🎬 Indian cinema gains popularity in Russia. Look what Russian TV is broadcasting right now: the Baahubali with Russian voiceover! pic.twitter.com/VrIgwVIl3b
— Russia in India (@RusEmbIndia) May 28, 2020
గ్లామర్ పేరిట పొట్టి బట్టలు వేసుకోలేను : అనుపమ పరమేశ్వరన్