జనసేన మాజీ నేత ఆకుల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ వైసీపీ లో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ వారిద్దరికీ పార్టీ కండువా కప్పి వైకాపాలోకి ఆహ్వానించారు. జగన్ సుపరిపాలనలో భాగమయ్యేందుకే పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు.
చాలా రాజకీయ పార్టీలు ఎన్నికలకు మందు మేనిఫెస్టోను ప్రకటించి.. ఆ తర్వాత దానిని పట్టించుకోవని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం మేనిఫెస్టోలో పేర్కొన్న అభివృద్ధి కార్యక్రమాలను తూచ తప్పకుండా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని ఆకుల అన్నారు. ఆయన చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకే వైకాపాలో చేరుతున్నట్లు చెప్పారు.