telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మళ్ళీ సైరా చూడాలని .. అనిపిస్తూనే ఉంది .. : రత్నవేలు

ratnavelu on syeraa movie

అక్టోబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సైరా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు సీనీ చరిత్రలో నిలిచిపోయేలా సైరాను తెరకెక్కించిన రామ్ చరణ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. సైరాలో చిరు నటనను సినీ లోకం పొగడ్తలతో ముంచెత్తుతోంది. తన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయే సినిమా అంటూ అందరూ కీర్తిస్తున్నారు. సైరాను మరోసారి వీక్షించిన రత్నవేలు.. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు.’సైరాను మరోసారి చూశాను. చిరంజీవి తన సినీ జీవితంలోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. బ్రిటీష్ వారిపై గర్జించే సింహాంలా దూకాడు.. క్లైమాక్స్లో చిరు నటన అద్భుతం.. హ్యాట్సాఫ్ చిరు సర్.. మీరు చూపించిన ప్రతీ ఎమోషన్ను చూపించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది, అది నా అద`ష్టంగా భావిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.

కేవలం నటీనటులకే కాకుండా సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు వస్తున్నాయి. అన్ని విభాగాలు సమష్టిగా కలిసి పని చేయడంతోనే ఈ మూవీ ఇంతటి విజయాన్ని సాధించిందని అందరూ అంటున్నారు. ఆర్ట్ విభాగం, క్యాస్టూమ్ విభాగం, కెమెరామెన్, సంగీతం, నేపథ్య సంగీతం ఇలా అన్నీ కలిసి సైరాను ఈ స్థాయిలో నిలబెట్టాయి. సైరాకు కెమెరామెన్ గా పనిచేసిన రత్నవేలుకు అన్ని వైపులా నుంచి అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. రత్నవేలు కెమెరా పనితనం అందరికీ తెలిసినా.. సైరాతో మరోసారి తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు. సినిమాను అద్భుతంగా మలిచి.. ప్రేక్షకులకు అందించాడు. విజువల్ వండర్ గా సైరాను తెరకెక్కించడంతో రత్నవేలు పోషించిన పాత్రను అందరూ ప్రశంసిస్తున్నారు. భారతదేశం గర్వించదగ్గ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్.. సైరా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘సినిమాకు సంబంధించి ప్రతీ అంశాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. కంగ్రాట్స్ ర్యాండీ.. దేశవ్యాప్తంగా సైరా దూసుకుపోతోంది. చిరంజీవి బ్యాక్ విత్ బ్యాంగ్’అంటూ ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ.. పీసీ శ్రీరామ్ సర్.. మీరు పొగిడారంటే అదే చాలు.. అని అన్నాడు.

Related posts