telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం

apsrtc tsrtc

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బస్సులు రోడ్డేక్కినప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇప్పటివరకు మోక్షం లభించలేదు. కిలోమీటర్లు, బస్సు రూట్ల అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఏపీ తరఫున ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు, ఈడీ బ్రహ్మానందరెడ్డి… తెలంగాణ తరఫున ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ, రూట్ల వారీగా ఉభయ రాష్ట్రాలు సమానంగా బస్సు సర్వీసులు నడపాలని ప్రతిపాదించామని తెలిపారు. రూట్ల వారీగా స్పష్టత ఇస్తేనే తాము ముందడుగు వేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరితేనే తాము బస్సులు తిప్పుతామని సునీల్ శర్మ స్పష్టం చేశారు.

Related posts