telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బాబు అప్పుడు హైదరాబాద్‌ వదిలివచ్చారు..ఇప్పుడు అక్కడికే పారిపోయారు!

srikanthreddy ycp

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు అప్పుడు హైదరాబాద్‌ వదిలివచ్చారని.. ఇప్పుడు వరదలకు భయపడి హైదరాబాద్ పారిపోయారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.

వైఎస్‌ చేపట్టిన సాగునీటి ప్రాజెక్ట్‌లకు అంచనాలు పెంచి కోట్లు దోచేశారని ఆరోపించారు. పట్టిసీమ పేరుతో రూ. 400 కోట్లు దోచేశారని ఆరోపించారు. పోలవరం పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని చూస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అరాచకాలను బీజేపీ నేతలు ప్రశ్నించాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Related posts