telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్ కు రానా గిఫ్ట్… బాల్యం గుర్తొచ్చిందన్న ఎన్టీఆర్

Rana Daggubati Gift,NTR

“బాహుబలి” చిత్రాల్లో భళ్లాలదేవుడిగా నటించి అశేష ప్రేక్షకాదరణను పొందాడు దగ్గుబాటి రానా. ఈ చిత్రం తరువాత దేశవ్యాప్తంగా రానాకు మంచి గుర్తింపు రావడంతో కేవలం తెలుగుకే పరిమితం కాకుండా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బహుభాషా నటుడిగా మారిపోయాడు రానా. ఇటీవల “అమర్ చిత్ర కథ”తో కలిసి చిన్నారులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాడు రానా. కామిక్ పుస్తకాల ద్వారా చిన్నారులకు భారత సంస్కృతిని చేరువ చేసిన “అమర్ చిత్ర కథ” థీమ్ పార్కులు, లెర్నింగ్ సెంటర్ల రూపంలో మన ముందుకు రానుంది. ఈ పుస్తకాలలో మన పురాణాలు, చరిత్రలోని గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలు, వీరగాథలు, జానపద కథలు వంటివి ఉంటాయి.

వీటి ప్రమోషన్ సంగతి రానా చూసుకుంటున్నాడు. అందుల భాగంగానే “అమర్ చిత్ర కథ” పుస్తకాల సిరీస్ ను ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా పంపాడు రానా. ఈ గిఫ్ట్ ను చూసిన ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ “”అమర్ చిత్ర కథ” అనే కామిక్ పుస్తకాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు రానా. నా బాల్యాన్ని అభయ్ తో షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించావు” అని ట్వీట్ చేస్తూ తన సంతోషాన్ని తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్”లో నటిస్తున్నాడు.

Related posts