telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాని “గ్యాంగ్ లీడర్” ప్రీమియర్ షో కలెక్షన్స్

Gang-Leader

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మించారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషించారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇది ఒక రివేంజ్ డ్రామా. మరోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నాని కామెడీ టైమింగ్ కు మంచి స్పందన వస్తోంది. తొలి రోజు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. “గ్యాంగ్ లీడర్” చిత్రం యుఎస్ ప్రీమియర్స్ ద్వారా ఇప్పటివరకు 317458 డాలర్లు రాబట్టునట్లు తెలుస్తోంది. మొత్తం 182 లొకేషన్స్ లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇది మంచి ఆరంభమే అని చెప్పాలి. ఇక ఈ వీకెండ్ గ్యాంగ్ లీడర్ చిత్రం సాధించే వసూళ్ళని బట్టి సక్సెస్ రేంజ్ ఉంటుంది.

Related posts