మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న 66వ చిత్రాన్ని దీపావళి సందర్బంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తరకెక్కుతుందని నిర్మాత ఠాగూర్ మధు తెలిపారు. డాన్‌శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం తమిళ సముద్రఖని నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పుడు మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కథ, పాత్ర నచ్చడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. అయితే, ఆమె ఎలాంటి పాత్ర చేస్తున్నారన్న విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. నవంబర్ 14న ఈ మూవీ గ్రాండ్‌గా లాంచ్ కానుంది. వెంటనే చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రవితేజ త్వరలో డిస్కోరాజా చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్న విషయం తెలిసిందే.
previous post
నీరే జీవనానికి ఆధారం… కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం: నాగార్జున