బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 106వ చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఇటీవల తొలి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రెండో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. కాగా.. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్రలో భూమిక నటింప చేస్తున్నారట. బాలకృష్ణ గత చిత్రం ‘రూలర్’లో నటించిన భూమిక మరోసారి బాలయ్య సినిమాలో నటించనున్నారు. కెరీర్ ప్రారంభంలో అగ్ర కథానాయకులందరితోనూ కలిసి నటించిన భూమిక చావ్లా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఈ మధ్య సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె అక్క, వదిన పాత్రల్లో మెప్పిస్తున్నారు. పిల్మీ వర్గాల సమాచారం మేరకు భూమికకు మరో మంచి అవకాశం దక్కిందట. మరి లేడీ విలన్‌గా భూమిక ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.