telugu navyamedia
సినిమా వార్తలు

ఫిలిం నగర్ సెంటర్ లో పేదల కోసం ఉచిత మెగా ఆరోగ్య శిబిరం

Free Health Camp,Film Nagar
పేద ప్రజల ఆరోగ్య పరి రక్షణ కోసం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్  మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా , అభినందనీయంగాను ఉందని నాగబాబు చెప్పారు . ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆదివారంనాడు పేదల కోసం ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించింది . అన్నిరకాల వైద్య సేవల  ప్రత్యేక డాక్టర్ల  బృదం పేద ప్రజలను పరీక్షించి  మందులను ఇచ్చింది . అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేసింది . 
Free Health Camp,Film Nagar
ఈ సందర్భంగా ప్రత్యేక అతిధిగా వచ్చిన నాగ బాబు మాట్లాడుతూ .. వైద్యం చాలా ఖరీదు అయిపోయిందని , పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందటం లేదని , ఇలాంటి స్థితిలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్  పేద ప్రజల కోసం ఇలాంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఎంతో బాగుందని అన్నారు . పేద ప్రజలు ఎంతో మంది ఈ శిబిరానికి వచ్చి తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు . ఈ సందర్భంగా అధ్యక్షుడు  డాక్టర్ కెఎల్ . నారాయణ, డాక్టర్ కె. వెంకటేశ్వరరావులను అభినందిస్తున్నాని చెప్పారు . 
నిర్మాత అల్లు అరవిందు మాట్లాడుతూ . ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం బాగుందని , మొదటి నుంచి అన్ని క్లబ్ ల్లా కాకుండా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్  ప్రతి సంవత్సరం ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుందని , ఈరోజు అన్ని రకాల సేవలను ఉచితంగా ఉపయోగించుకొనే అవకాశాన్ని పేద ప్రజలకు కల్పించడం ఎంతో తృప్తిని కలిగించిందని చెప్పారు . 
Free Health Camp,Film Nagar
డాక్టర్ కె .ఎల్ . నారాయణ మాట్లాడుతూ .. ఇలాంటి మెడికల్ క్యాంపులను  నిర్వహించడంలో డాక్టర్ కె. వెంకటేశ్వరరావు గారు అందిస్తున్న సహకారం మరువలేమని అన్నారు. ఈరోజు నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి అనేక మంది డాక్టర్లు వచ్చారని చెప్పారు . వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు . 
డాక్టర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ , ఈరోజు ఆరోగ్య శిబిరాన్ని ఇప్పటికే 400 వందల మంది పేదలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని , వైద్యాన్ని ఉచితంగా పేదలకు అందించడంలో ఎంతో  సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు . 
మా అధ్యక్షుడు  శివాజీరాజా మాట్లాడుతూ , పేద ప్రజలకోసం ఇలాంటి శిబిరాన్ని నిర్వహించిన కల్చరల్ సెంటర్ కార్య వర్గ సభ్యులను అభినందించారు 
ఈ కార్యక్రంలో కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి , ఉపాధ్యక్షులు ముళ్ళపూడి మోహన్ , కోశాధికారి తుమ్మల రంగారావు, హరి ప్రసాద్ , శైలజ , కిషోర్ , భగీరథ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు 

Related posts