యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. . ఎంఎస్. రాజశేఖ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా కృతీ శెట్టి , క్యాథెరీన్ థెరిస్సా నటిస్తున్నారు.
ఈ సినిమాలో నితిన్ ఐఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
నితిన్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా టీజర్‌ను చేసింది. ‘ఫస్ట్ అటాక్’ పేరుతో విడుదల చేసిన ఈ విడుదల ఆకట్టుకుంటోంది.. ఇందులో నితిన్ గొడ్డలి పట్టుకుని పది మంది వెేటాడుతూ కనిపించారు.
ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ఈ చిత్రం జులై 8న ప్రేక్షకుల ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
హృతిక్ డాన్స్ మూవ్మెంట్స్ చూసి బెదిరిపోయాను… వాణి కపూర్