telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాలైంటైన్స్ డే రోజున ఆ గిఫ్ట్ మాత్రం వద్దు… : రష్మీ

Rashmi-Gautham

“జబర్దస్త్” యాంకర్ రష్మీ గౌతమ్ ఒకవైపు షోలు చేస్తూనే, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కన్పిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న క్రేజీ యాంకర్లలో రష్మీ ఒకరు. ఇక ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్డేట్ గా ఉంటూ తన అభిమానులతో చాట్ చేస్తూ ఉంటారు. ఇక సినిమాలు మాత్రమే కాకుండా పలు సామజిక అంశాలపైనా రష్మీ స్పందిస్తూ ఉంటారు. అయితే రష్మీ తాజాగా వాలైంటైన్స్ డే రోజున మీకు నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వండి కానీ పెంపుడు జంతువులను మాత్రం కానుకగా ఇవ్వకండి అంటున్నారు రష్మి. ‘‘పిల్లులు, కుక్కలను ఫైనాన్షియల్‌గా, ఎమోషనల్‌గా ఓ ఫ్యామిలీ పది నుంచి పదిహేనేళ్ల వరకు చూసుకోవాలి. ఈ వ్యాలెంటైన్స్ డే రోజున దయచేసి జంతువులను కొనుక్కుని వాటిని మీ ప్రేమికులకు కానుకలుగా ఇవ్వకండి’ అని పేర్కొన్నారు. అయితే రష్మి ఈ పోస్ట్ పెట్టగానే.. వెంటనే పలువురు నెటిజన్స్ సుడిగాలి సుధీర్‌ను ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు. వ్యాలెంటైన్స్ డే రోజున ‘ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్’ షోలో రష్మి, సుధీర్ చేత స్పెషల్ పర్ఫామెన్స్ చేయించారు. ‘వెన్నలవే వెన్నలవే’ పాటకు రష్మి, సుధీర్ డ్యాన్స్ చేసారు. ఆ ప్రోమోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత సుధీర్ గిఫ్ట్ ఇస్తూ రష్మీకి విష్ చేసాడు. ఈ జంటకు విపరీతమైన క్రేజ్ ఉంది. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నామని, తప్పకుండా ఫ్యాన్స్ మెచ్చుకునేలా ఓ మంచి సినిమా చేస్తామని ఇటీవల రష్మి, సుధీర్ ఇటీవలే తెలిపారు.

Related posts