telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆడపిల్ల పుట్టిందని… పసిపాపపై తండ్రి దారుణం

Baby

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం రేగుంటలో ఆడపిల్ల పుట్టిందని ఓ తండ్రి చేసిన దారుణం హృదయవిదారకంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… కత్తిగూడెం గ్రామానికి చెందిన అడబాల సూర్యతేజ, రేగుంట గ్రామానికి చెందిన అఖిల రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఏడాది కుమార్తె లక్ష్మి ఉంది. ఇటీవల రెండో సంతానంగా మరో అమ్మాయి జన్మించింది. మళ్లీ కుమార్తె పుట్టిందని కోపంగా ఉన్న సూర్యతేజ పసికందును కర్కశంగా నీటితొట్టిలో పడేసి దారుణానికి ఒడిగట్టాడు. కుమార్తె పుట్టినప్పటి నుంచి ఇంటికి రాని అతడు సోమవారం రాత్రి వచ్చాడు. మంగళవారం ఉదయం నిద్రలేచిన అఖిల మంచంపై పసిపాప కనిపించకపోవడంతో తన తల్లికి చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి పాప కోసం వెతికగా ఇంటి ఆవరణలో ఉన్న తొట్టెలో తేలి ఉన్న పాపను గమనించారు. ఇక తన నెలల పాపని అలా చూసిన అఖిల గుండెలవిసేలా రోదించింది. ఆ ఘటన చుట్టుపక్కల వారిని కలచివేసింది. పాపను నీటి తొట్టిలో వేసిన సూర్యతేజను గ్రామస్థులు చితకబాదారు. సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Related posts