telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా ?

NBK

ప్రస్తుతం బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో బీబీ3 (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ తొలి నుంచి ప్రచారంలో ఉంది. సింహ, లెజెండ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య-బోయపాటి ‘మోనార్క్’తో హ్యాట్రిక్‌పై కన్నేశారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఈ చిత్రం షూటింగుకి కూడా తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో.. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ చేయబోయే తదుపరి చిత్రం గురించి తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే, ‘ఎఫ్ -2’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రాన్ని చేయనున్నట్టు తెలుస్తోంది. బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న దర్శకుడు అనిల్ తాజాగా ఆయన కోసం ఓ కథను సిద్ధం చేశాడట. త్వరలోనే బాలయ్యతో స్క్రిప్టుకి ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నంలో ఆయన వున్నారని సమాచారం.

Related posts