నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికీ మంచి క్రేజ్ టాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు. అయితే నందమూరి అభిమానులు బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండు మూడేళ్లుగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మోక్షజ్ఞకు అసలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదనే వార్తలు కూడా వచ్చాయి. ఆయనకి సంబంధించిన ఫొటో ఒకటి బయటికి రావడం .. అందులో మోక్షజ్ఞ చబ్బీగా ఉండటం చూసి, ఇక ఆయనకి యాక్టింగ్ వైపు వచ్చే ఆలోచన లేదని అనుకున్నారు. కానీ నటనలో శిక్షణ ఇప్పించడం కోసం కుటుంబ సభ్యులంతా కలిసి ఆయనని న్యూయార్క్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ‘న్యూయార్క్ ఫిల్మ్ అండ్ థియేటర్ ఇనిస్టిట్యూట్’లో శిక్షణ నిమిత్తం ఆయనను పంపిస్తున్నట్టు చెబుతున్నారు. స్టార్ హీరోల కిడ్స్ చాలామంది ఇక్కడే నటనలో తర్ఫీదును పొందారట. 12 వారాల కోర్సును పూర్తి చేసుకుని మోక్షజ్ఞ తిరిగి వస్తాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.
previous post