“ప్రతిరోజూ పండగే” సినిమాతో భారీ విజయం అందుకున్నాడు మెగా హీరో సాయితేజ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ‘ప్రతిరోజు పండగే’ తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. నభనటేష్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు రెండు వీడియో సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా తాజాగా ‘అమృత’ లిరికల్ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. తమన్ సంగీతం అందించారు. అమృత ప్రేమలో పడిన విరాట్.. బ్రేకప్ తర్వాత పాడుకునే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. అయితే తాజాగా..ఈ చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. ఈ సినిమా చూసిన సభ్యులు ఈ చిత్రానికి “యూ” సర్టిఫికెట్ జారీ చేశారు.
previous post
next post
కంగనాపై కామెంట్స్ తో షాకిచ్చిన అలియా