telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కొత్త జిల్లాల పునర్విభజనపై అధికారులకు జగన్ దిశా నిర్ధేశం..

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.

ఈ ఏడాది జనవరి 26 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ అధికారులకు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారు. ఏప్రిల్ 4 నుండి కొత్త జిల్లాల నుండి పాలన అమలు.. ఏప్రిల్‌ 6న వాలంటీర్ల సత్కారం, ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పది కాలాలు గుర్తుండేలా కొత్త జిల్లాల భవనాల నిర్మాణం చేయాలని ఆయన కోరారు.

కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలన్నారు. దీనితోపాటు కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని, కలెక్టర్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే భవనంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అంతేకాకుండా వీరి క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలన్నారు.

ఈ భవనాలకోసం మంచి డిజైన్లను ఎంపికచేసుకోవాలని, పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలన్నారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.

కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల 600 సలహాలు, సూచనలు వచ్చాయన్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల్లో సిబ్బంది, ఉద్యోగుల పోస్టింగ్ విషయమై సిక్స్ పాయింట్స్, రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా పాటించినట్టుగా సీఎంకు అధికారులు వివరించారు.

ఈ ఏడాది జనవరి 26 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ అధికారులకు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారు. ఏప్రిల్ 4 నుండి కొత్త జిల్లాల నుండి పాలన అమలు కానుంది. ఏప్రిల్‌ 6న వాలంటీర్ల సత్కారం, ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Related posts