telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దక్షిణాసియా టాప్ 400 ప్రభావ శీలుర జాబితాలో శ్రీముఖి

Srimukhi

దక్షిణాసియా టాప్ 400 ప్రభావ శీలుర జాబితాలో తెలుగు యాంకర్ శ్రీముఖి చోటు సంపాదించుకుంది. ఈ విషయాన్ని శ్రీముఖి స్వయంగా ప్రకటించింది. న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ, బ్రిటీష్ పాత్రికేయుడు కిరణ్ రాయ్ సంయుక్తంగా కళలు, మీడియా, సంస్కృతి విభాగాల్లో ఈ జాబితా రూపొందించారు. ఈ జాబితాలో తనకు చోటు దక్కినందుకు శ్రీముఖి హర్షం వ్యక్తం చేస్తూ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో భారత్‌లోని పలువురు ప్రముఖల జాబితాలో తాను కూడా నిలవడంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పింది. ఈ జాబితాలో మొత్తం 230 మంది భారత్, అఫ్ఘానిస్థాన్, పాక్ ప్రముఖులే ఉన్నారని తెలిపింది. కిరణ్ రాయ్ తనను కూడా ఇంటర్వ్యూ చేశాడని, త్వరలోనే దాన్ని చూడొచ్చని చెప్పింది. అది చాలా సరదాగా సాగిందని తెలిపింది. ఇందులో టాలీవుడ్ నటి ప్రగతి, యాంకర్లు ప్ర‌దీప్, ర‌ష్మి కూడా చోటు దక్కించుకున్నారు. యాంకర్ రష్మీ కూడా ఇటీవల ఈ ఇంటర్వ్యూ గురించి తెలుపుతూ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

Related posts