telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘానికి నిధుల విడుదలపై ప్రభుత్వం సహకరించడంలేదని నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వెల్లడించింది హైకోర్టు. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించడం లేదన్న హైకోర్టు..ఈసీ ఇచ్చిన వినతులపై ప్రభుత్వం స్పందించకుండా బాధ్యతారాహి త్యంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. తాము తొలగించిన వ్యక్తి తిరిగి ఈసీగా రావటంతో ప్రభుత్వం నాన్ కో ఆపరేటింగ్ గా వ్యవహరిస్తోందన్న న్యాయ స్థానం..ఇది సరికాదంది. ప్రభుత్వాలు మారుతాయి తప్ప రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఉంటాయన్న హైకోర్టు.. రాజ్యాంగ బద్ధ సంస్థలను కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని తెలిపింది. ఎన్నికల సంఘం 3 రోజుల్లోగా ప్రభుత్వానికి సవివర వినతి పత్రం సమర్పించాలని ఆదేశించింది.  ప్రభుత్వం దీన్ని పరిశీలించి ప్రభుత్వం ఏం చేసిందో నివేదిక రూపంలో 15 రోజుల్లోగా హైకోర్టుకి సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మాజీ జస్టిస్ కనగరాజ్ ఫీజు చెల్లింపుల విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.. కనగరాజ్ తన పదవికి సంబంధించి అడ్వకేట్ ను నియమించుకుంటే ఆయనే న్యాయవాదికి సొంత చెల్లింపులు చేసుకోవాలంది హైకోర్టు. కనగరాజ్ ఇంటి కోసం 20 లక్షలు, ఫర్నిచర్ కోసం కేటాయించిన 15 లక్షలు ఇవ్వాలా వద్దా అనేది ఈసీ మరోసారి పరిశీలించాలన్న హైకోర్టు
..కనగరాజ్ న్యాయవాది కోసం పెట్టిన ఖర్చు వివరాలు ప్రజలకు తెలియాలని, ఇదంతా ప్రజలకు చెందిన సొమ్మని పేర్కొంది.

Related posts