telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నాగబాబు కామెంట్స్

Nagababu

తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఆర్ఆర్ఆర్ సినిమాపై నా అభిప్రాయాల గురించి రీసెంట్‌గా ఫేస్‌బుక్ లైవ్‌లో కొందరు నన్ను అడిగారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రను చూసాను. ఆ వీడియో చూసాకా.. రామరాజు పాయింట్ ఆఫ్ వ్యూలో కొమరం భీమ్ పాత్ర ఉండబోతుందో అనే ఆతృత నాలో మొదలైంది అన్నారు. ఇప్పటికే రామరాజు పాత్రతో ఈ సినిమాపై అంచనాలు పెంచారు. ఇక కొమరం భీమ్‌ ప్రోమో విడుదలైతే ఇంకెన్ని అంచనాలు ఏర్పడుతాయో అని సినిమాపై తనకెంతో ఆసక్తి ఉందో వివరించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందనే ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. మెగా, నందమూరి వంటి మాస్ హీరోలతో రాజమౌళి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ పెట్టారు. మొత్తానికి రాజమౌళి నుంచి ఈ వస్తోన్న ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుంగా జనవరి 8న విడుదల కానుంది.

Related posts