telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరో తనయుడితో ప్రియాప్ర‌కాశ్ వారియ‌ర్…!

priya

హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ “అర్జున్ రెడ్డి” తమిళ రీమేక్ తో తమిళంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ధృవ్ మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ శిష్యుడు రవికాంత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ధృవ్‌. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కథానాయికగా ఎంపికైందని టాక్‌. ధృవ్‌ సినిమాలో సోలో హీరోయిన్‌గా అవకాశం రావడంతో ఈ బ్యూటీ ఫుల్‌ ఖుషీ అవుతున్నారట. “ఒరు అదార్ లవ్ ” సినిమా టీజర్ లో వెరైటీగా కన్ను గీటిన ప్రియా ప్రకాశ్ ఆ ఒక్క టీజర్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఈ వింక్ బ్యూటీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అయితే ఆమె నటించిన “ఒరు అదార్ లవ్” చిత్రాన్ని “లవర్స్ డే”గా తెలుగులో కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో ప్రియా వారియర్ నటన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు తెలుగులో నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలోనూ ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి రెండో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Related posts