సంతోషాన్ని చూసి సహించలేక..
వసంతాన్ని చూసి ఓర్వలేక..
బిరబిరా వచ్చింది శిశిరం….
వలయంలా చుట్టుముట్టి.. ఒక్క దెబ్బతో..
బ్రతుకును శిధిలం చేసింది….!
పాపం.. ఆ.. శిల…
కష్టాన్ని ఓర్చుకుంటూ..
దు:ఖాన్ని అణుచుకుంటూ..
పైకి లేచింది….!
కూలిన కలలన్నిటినీ కట్టగట్టాలని…
చెదిరిన ఆశలన్నిటినీ
దరికి చేర్చాలని.. ప్రయత్నిస్తోంది….!
మట్టిని తడుపుదామంటే..
చిత్రంగా కన్నీరు ఇంకిపోయిందట….!
గోడలను నిలబెడదామనుకుంటే..
గుండె ఎండిపోయిందట….!
ఇటుకలను పేర్చాలంటే.. శక్తి సరిపోలేదట..
బేలగా.. దిక్కులు చూస్తూ నాకంట పడింది…!
చలించిపోయాను…..
చెంతకు చేరి చేతిని అందించాను..
ఆసరాగా నిలబడి.. గుండెను తోడిచ్చాను..
మా ఇద్దరినీ చూసి…
శిశిరం భయపడి పారిపోయింది..
“వసంతం”…..
చిరునామాను వెతుక్కుంటూ వచ్చింది…
శిల… శిల్పంగా మారింది…!
మా “పెదాల అంచుల్లో నవ్వుల పూదోట” విరబూసింది….!!