telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ రోగాల రాష్ట్రంగా మారింది: భట్టి విక్రమార్క

Bhatti-Vikramarka congress

తెలంగాణ ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మరోసారి విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రోగాల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. ఎందరో రోగాల భారీనపడి అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ తన రాజమహల్ నుంచి బయటకొచ్చి చూస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ నెల 19 నుంచి జిల్లా కేంద్రాల్లో ఆసుపత్రులను సందర్శిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని అన్నారు.

Related posts