telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ నేత షా ఫైజల్ ను ఎయిర్ పోర్టులో అడ్డుకున్న పోలీసులు!

faisal-shah-ias

జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఫైజల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను శ్రీనగర్ కు తిప్పిపంపారు. 2009 సివిల్స్ పరీక్షలో షా ఫైజల్ టాప్ గా నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి కశ్మీరీగా రికార్డు సృష్టించారు. అయితే కొద్దిరోజులకే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఫైజల్ జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు.

జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడం, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని ఫైజల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈద్‌ సందర్భంగా ప్రతీ అవమానానికి బదులు తీర్చుకునే వరకు పండుగ జరపుకోబోనని ప్రకటించారు. కశ్మీర్‌లో రాజకీయ హక్కులను కాపాడుకునేందుకు సుస్థిర రాజకీయ ఉద్యమం రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

Related posts