ఐపీఎల్ 2020 లో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. అయితే హైదరాబాద్ బౌలర్లు ముంబైని బాగానే కట్టడి చేసారు. కానీ పోలార్డ్ చివర్లో 25 బంతుల్లో 41 పరుగులు చేయడంతో ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక 150 పరుగుల లక్ష్యం తో బరిలో దిగ్గిన హైదరాబాద్ జట్టులో ఓపెనట్లు వార్నర్, వృద్దిమాన్ సాహా అద్భుతంగా ఆడటంతో ఒక వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది. వార్నర్ 58 బంతుల్లో 85 పరుగులు చేయగా సాహా ౪౫ బంతుల్లో 58 పరుగులు బాదడంతో 17.1 ఓవర్లలోనే సన్ రైజర్స్ విజయం సాధించింది. ఈ విజయం తో హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానానికి వెళ్లి పే ఆఫ్ కి అర్హత సాధించగా బెంగళూరు నాలుగో స్థానికి వచ్చింది. ఇక నాలుగో స్థానంలో ఉన్న కోల్ కతా ఇంటిదరు పట్టింది. అంటే తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ లో హైదరాబాద్-బెంగళూరు ను ఎదుర్కోనుంది.
previous post