telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ తో మురుగదాస్… క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Murugadas

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ప్రస్తుతం ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో “ద‌ర్బార్” అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక మురుగదాస్ ఇటు తెలుగు అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌ని వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో అల‌రిస్తూ వ‌స్తున్నారు. తెలుగులో చిరంజీవితో స్టాలిన్,మ‌హేష్ బాబుతో స్పైడ‌ర్ చిత్రాల‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మురుగదాస్ తెలుగులో పలువురు స్టార్ హీరోలతో తన తరువాత ప్రాజెక్ట్ చేయబోతున్నాడంటూ అర్థాలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమా త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో మురుగ‌దాస్ ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై స్పందించిన మురుగ‌దాస్ “ఆ వార్త‌ల‌న్నీ అవాస్త‌వం. గతంలో జూనియ‌ర్‌కి ఓ స్టోరీ న‌రేట్ చేశాను. కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. తాజాగా వ‌స్తున్నవన్నీ పుకార్లే” అని క్లారిటీ ఇచ్చారు మురుగ‌దాస్.

Related posts