telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అడల్ట్ కంటెంట్ తో “బి.కామ్ లో ఫిజిక్స్”… షాకింగ్ ఫస్ట్ లుక్

Bcom

ఏడుచేపల కథ అనే బోల్డ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్యామ్ జే చైతన్య మరో అడల్ట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాపులర్ డైలాగ్ ‘బి.కామ్ లో ఫిజిక్స్’ టైటిల్ గా పెట్టేసాడు శ్యామ్. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రోడక్షన్ బ్యానర్ పై తెలుగుతో పాటు సేమ్ టైటిల్ తో హిందీలో కూడా నిర్మిస్తున్నారు. అంకిత రాజ్ పుత్ యశ్వంత్ సునీల్ మేఘనా చౌదరి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. మూత్రశాలలోని గోడపై ‘రాకేష్ మాస్టర్’ – ‘ఆర్జీవీ’ – ‘పేటియం కత్తి మహేష్’ – ‘కేఏ పాల్’ – ‘కరణ్ జోహార్’ – ‘టెంప్ట్ రవి’ అనే నేమ్స్ రాసి ఉన్నట్లు పోస్టర్ డిజైన్ చేసారు. అంతేకాకుండా ఓ అమ్మాయి హార్ట్ సింబల్ మధ్యలో ఉన్న ‘ఆర్జీవీ’ పేరుపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు చూపించారు. పోస్టర్ చూస్తేనే ఇది బోల్డ్ స్టోరీతో వస్తున్న సినిమా అని అర్ధమవుతుంది.

Related posts