మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చి ఆరు రోజులవుతున్నా ఇంకా ప్రకంపనలు తగ్గడం లేదు . రచ్చ ఆగడం లేదు . “మా ” అధ్యక్షుడు గా మంచు విష్ణు పదవీ బాధ్యతలు చేపట్టి న నాటి నుంచి ప్రకాష్ రాజ్ “మా “ను రెండుగా చీల్చి వేరే అసోసియేషన్ పెడతారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అవి కేవలం పుకారులు మాత్రమే అని ప్రకాష్ రాజ్ కొట్టేశారు . విష్ణు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచెయ్యడడానికి ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా కూడా చేశారు.
అయితే “మా ‘వివాదడం ఇంతటితో సర్దుమణిగి పోతుందని అందరు భావించారు . కానీ , మంచి విష్ణు ను తామ ప్రశ్నిస్తూనే ఉంటామని ప్రకాష్ రాజ్ ప్రకటించి 24 గంటలు గడవక ముందే “మా ” ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ పై ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు . జూబిలీ హిల్స్ స్కూల్ లో “మా ” ఎన్నికలు నిర్వహించారు . ఆదివారం రోజు జరిగిన ఎన్నికలకు సంబందించిన సి సి కెమెరాల ఫుటేజ్ తమకు ఇవ్వాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో మంచి విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలసి నందమూరి బాలకృష్ణ ను కలసి “మా “లో జరుగుతున్న పరిణామాలు, ప్రకాష్ రాజ్ చేస్తున్న ఆరోపణలు, సవాళ్ళను వివరించి మద్దతు కోరినట్టు చెబుతున్నారు. మంచు విష్ణు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా కలుసుకున్నారు.
ప్రకాష్ రాజ్ ఎన్నికలకు సంబందించిన ఫుటేజీ తీసుకొన్న తరువాత కోర్టుకు వెళతారనే వార్తలు వస్తున్నాయి. దీంతో మోహన్ బాబు అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ గ్రూప్ సభ్యులందరికీ మంచు మనోజ్ అంటే సదభిప్రాయం, స్నేహ భావం వుంది. “మా ” ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో దాన్ని నివారించడానికి మనోజ్ ఎంతగానో ప్రయత్నం చేశాడని , ఆరోజు మనోజ్ లేకపోతే రెండు గ్రూపుల మధ్య కొట్లాటలు కూడా జరిగేవని పేర్కొన్నారు.
అందుకే మోహన్ బాబు తన రెండవ కుమారుడు మనోజ్ ను రంగంలోకి దించాడా ? గురువారం రోజు మనోజ్ పవన్ కళ్యాణ్ ను కలసి గంటసేపు చర్చించారనే ఓ వార్త ఇందుకు బలం చేకూరుస్తుంది. పవన్ కళ్యాణ్ ద్వారా తన సోదరులు చిరంజీవి , నాగ బాబుకు చెప్పించి “మా ” వివాదానికి తెర దించాలనే ప్రయత్నం మనోజ్ చేస్తున్నాడా ?మనోజ్ , పవన్ కళ్యాణ్ మధ్య ఏమి జరిగిందో తెలియక పోయినా చక్కటి వాతావరణంలో వారిద్దరూ మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది.”పవన్ కళ్యాణ్ హృదయపూర్వకంగా మాట్లాడారు . పవన్ నా పట్ల చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అని మనోజ్ ట్వీట్ చేశారు ఈ రాజీ ఫలిస్తుందా ? వివాదం అలాగే కొనసాగుతుందా ? చూడాలి “మా”లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి?