telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

యుద్ధం వద్దు .. సెర్జికల్ స్ట్రైక్ ముద్దు .. : ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీ

udupi swamiji on india-pak situations

తాజా భారత్-పాక్ మధ్య పరిస్థితుల గురించే ప్రస్తుతం ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలు.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై భారత్ దాడులు చేసిన తర్వాత మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం సంభవించడం ఖాయమన్న వార్తలు కూడా వచ్చాయి. తాజాగా, పాక్ తన సైన్యాన్ని సరిహద్దులకు తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీ, ఇరు దేశాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టు వస్తున్న వార్తలపై మాట్లాడారు. భారత్-పాక్‌ల మధ్య యుద్ధం ఏమాత్రం మంచిది కాదన్నారు. దీనివల్ల ఇరు దేశాలకు అపార నష్టం తప్పితే ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాక్‌కు సర్జికల్ స్ట్రయిక్స్ రూపంలో బుద్ధి చెప్పడమే సరైన పరిష్కారమన్నారు. పాక్ భూభాగంలోకి దూసుకెళ్లి అక్కడి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడాన్ని తాను సమర్థిస్తున్నానని స్వామీజీ పేర్కొన్నారు.

Related posts