సూపర్ స్టార్ మహేష్ బాబుహీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మహర్షి”. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషించాడు. వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి. ఫిలాసఫికల్ పాయింట్‌కి కమర్షియల్ అంశాన్ని జోడించి చిత్రాన్ని చాలా అందంగా తెరకెక్కించారు. రిషి జీవితంలో మూడుదశల్ని ప్రతిబింబిస్తూ కథను అల్లుకున్నారు. చిత్రంలో మహేష్‌బాబు, అల్లరి నరేష్, పూజాహెగ్డే మధ్య స్నేహాన్ని ఆవిష్కరించారు. ద్వితీయార్థంలో రైతు సమస్యలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. అన్నదాత దుస్థితిని అర్థవంతమైన సన్నివేశాలు, సంభాషణలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఊరి మేలు కోసం రిషి ఎంతవరకు పోరాటం చేశాడనే అంశాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించారు. గత కొద్ది రోజులుగా మహర్షి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందని సోషల్ మీడియాలో జరుగా ప్రచారం జరిగింది. దీనిపై వంశీ పైడిపల్లి తాజాగా స్పందించారు. మహేష్‌తో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రస్తుతం లొకేషన్ వేటలో ఉన్నాడట. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది.
previous post