telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బ్రహ్మాజీ తనయుడి వివాహం… సీక్రెట్ గా…!

Brahmaji

క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. తాజాగా ఆయన సీక్రెట్‌గా త‌న‌యుడి వివాహం గోవాలో నిర్వహించారు. బోపాల్ కుటుంబానికి చెందిన ప్రమోద్ వర్మ, పూనమ్ కుమార్తె అనుకృతి దీక్షిత్‌ను బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ వివాహం చేసుకున్నాడు. గోవాలోని ప్లానెట్ హాలీవుడ్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. వివాహ వేడుక‌కి సంజయ్ స్నేహితులుగా ఉన్న మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మాత్రమే హాజరయ్యారు. హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. సంజ‌య్ త్వ‌ర‌లో న‌టుడిగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఆయ‌న తాజాచిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. కాగా అనేక చిత్రాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌ పోషిస్తూ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన ప్ర‌ముఖ న‌టుడు బ్ర‌హ్మాజీ. 30 ఏళ్ళుగా టాలీవుడ్‌లో ప‌లు చిత్రాలు చేస్తూ వస్తున్నారు.

Related posts