telugu navyamedia
సినిమా వార్తలు

ఆ సెలెబ్రిటీ మాజీ లవర్స్ మళ్ళీ ఒక్కటయ్యారా ?

Simbu-with-Hansika

మిల్కీ బ్యూటీ హన్సిక, రొమాంటిక్ హీరో శింబు ఇద్దరూ మాజీ ప్రేమికులు అన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత వీరిద్దరూ వారి సినిమాలతో బిజీ అయిపోయారు. తాజాగా హన్సిక ప్రస్తుతం ‘మహా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం హన్సిక 50వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. గొడవలు విడిపోయిన తర్వాత వీరిద్దరూ జంటగా నటించలేదు. కానీ హన్సిక మహా చిత్రంలో గెస్ట్ రోల్ చేసేందుకు శింబు అంగీకరించాడు. తాజాగా జమీల్ చేసిన వ్యాఖ్యలతో శింబు, హన్సిక మళ్ళీ ప్రేమాయణం మొదలు పెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. “శింబు, హన్సిక అభిమానులు తొందర పడకండి.. ఈ మ్యాజిక్ కపుల్స్ ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేస్తాం” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయమై చర్చ మొదలైంది.

Related posts