telugu navyamedia
సినిమా వార్తలు

మ‌ద్యం మ‌త్తులో వ‌ర్మ లీల‌లు..

సెన్సేషనల్ డైరెక్టర్ రాం గోపాల్ వ‌ర్మ చాష్ట‌లు రోజు రోజుకు మితిమిరిపోతున్నాయి. అమ్మాయిలతో వర్మ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. చేతిలో మద్యం గ్లాసు, పక్కన అమ్మాయి లేనిదే వర్మకి ఒక్క రాత్రి అయినా గడవ‌న‌ట్టుంది.. గత రెండు రోజులుగా వర్మ చేస్తున్న వీరంగం సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది.

Drunk RGV Mad Dance With Actress Jyothi Goes Viral

ఇటీవ‌ల‌ సుల్తానా బర్త్ డే పార్టీకే సంబందించిన ఈ వీడియోలో నటి జ్యోతి రెడ్డితో అసభ్యకర రీతిలో డాన్స్ వేసిన వర్మ నెటిజన్స్ మనసులో మరింత చీప్ అయిపోయాడని కామెంట్స్ వస్తున్నాయి. నటి జ్యోతి తన స్కర్ట్ ని పైకి ఎత్తితే.. తన థైస్ పై ముద్దు పెట్టిన వర్మ చేష్టలు చూసేవారికి ఎబ్బుట్ట‌గా ఉంది. ఇక ఫుల్ డ్రింక్ లో ఉన్న వర్మ తన స్థాయిని మరిచి.. మద్యం మత్తులో కిందపడి జ్యోతి చుట్టూరా దొర్లుతూ డాన్స్ వేస్తూ వీరంగం సృష్టించాడు. ఈ అరాచక వర్మ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

The video of the girl in the name of Ram Gopal Varma went viral, RGV told the truth on Twitter - 23/08/2021

ఇది చూసిన నెటిజ‌న్స్ కాస్టింగ్ కౌచ్ ఇష్యులో వర్మ పేరు ఇప్పటివరకు రాకపోవటం బిగ్గెస్ట్ మిరాకిలేనా అంటున్నారు.హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, యాంకర్లని ఫ్లర్ట్ చేయటం వర్మ హాబీ అంటుంటారు నెటిజన్స్. వర్మ గత చరిత్రపై ఉండే కొద్దిపాటి అభిమానంతో ఈయన గారి చేష్టలని అమ్మాయిలందరూ మౌనంగా భరించటం మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. ఇక ఈ సారి అయితే వర్మ చేష్టలు మరింత దిగజారిపోయాయి అంటున్నారు నెటిజన్స్.

బిగ్ బాస్ ఫెమ్ యాంకర్ అరియానాతో జిమ్ లో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో తెలిసిందే. ఆ తరువాత బుల్లితెర హాట్ యాంకర్ అషూ రెడ్డి థైస్ కనిపించేలా కొత్త యాంగిల్ పెట్టి ఫోటోలు తీసి మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు వర్మ. ఇక నిన్న సుల్తానా అనే మరో అమ్మాయితో బర్త్ డే కేక్ కట్ చేపిస్తూ వర్మ చేసిన హంగామా కూడా తెగ వైరల్ అయింది.

Drunk RGV Mad Dance With Actress Jyothi Goes Viral

ఆ అమ్మాయిని ఎక్కడెక్కడో తాకుతూ కసిగా వర్మ వేసిన స్టెప్స్ మరువకముందే నేడు మరో వీడియో వైరల్ అవుతుంది. నటి జ్యోతితో మద్యం మత్తులో కిందపడి దొర్లుతున్న రామ్ గోపాల్ వర్మ జుగుప్సాకరమైన మరో వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో వ్యూస్ కోసం బోల్డ్ వీడియోలు చేసే వారి మాదిరిగా వర్మ చేష్టలు ఉంటున్నాయని కామెంట్స్ పెడుతున్నారు. దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు ఇలా తయారవ్వడం ఏంటని కామెంట్ చేస్తున్నారు.

Related posts