telugu navyamedia
సినిమా వార్తలు

స్వర్గీయ బాలుకు పద్మవిభూషణ్ ..

భారత దేశం గర్వించతగ్గ గాయకుడు, సంగీత దర్శకుడు , నటుడు , డబ్బింగ్ కళాకారుడు ఎస్ .పి సుబ్రహ్మణ్యం కు అరుదైన గౌరవం లభించింది . బాలు మారణానంతరం భారత ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ను ప్రకటించింది.

Balasubramaniam

బాలసుబ్రహ్మణ్యం గత సంవత్సరం కరోనాతో మరణించారు .ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డును రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ మంగళవారం రోజు ప్రదానం చేశారు . బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్ .పి .చరణ్ తన తండ్రి తరుపున రామనాథ్ కోవిందు నుంచి ఈ అవార్డును స్వీకరించారు.

న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో కన్నుల పండుగగా జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎమ్ . వెంకయ్య నాయుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,, హోమ్ మంత్రి అమిత్ షా , ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ మొదలైనవారు పాల్గొన్నారు .

Related posts