telugu navyamedia
సినిమా వార్తలు

మెగా ఫ్యామిలీ వరలక్ష్మీ వ్రతం..

 

శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతంకు ఎంతో విశిష్టత ఉండటంతో హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగురాష్టాల్లో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తారు. “వరలక్ష్మీ వ్రతం”ను సాంప్రదాయ పూజా విధానంతో భక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తారు. ముఖ్యంగా పెళ్ళైన మహిళలు వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసం ప్రతి రెండవ శుక్రవారం జరిగే ఈ పూజలో తప్పకుండా పాల్గొంటారు.

10 Most Suitable Varalakshmi Vratham Return Gift Ideas You Must Look Up for  Gifting Your Guests and Loved Ones!

అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనూ శ్రావణ శుక్రవారం ..వరలక్ష్మి వ్రతం సందర్భంగా మెగా స్టార్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేశారు. చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన మెగా కుటుంబంలోని నాలుగు తరాల మహిళలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది

మహిళలు అత్యంత ప్రాముఖ్యత ఉన్న వరలక్ష్మి అమ్మవారిని మెగాఫ్యామిలీలోని ఆడవాళ్లు కూడా అత్యంత భక్తి శ్రద్దలతో పూజించారు . ఇప్పుడు ఈ ఫోటోలో చిరంజీవి భార్య, ఆయన తల్లి అంజనా దేవి, ఉపాసన, శ్రీజ కుమార్తె నివృతి కూడా ఉన్నారు. “నాలుగు తరాలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నాము” అంటూ ఉపాసన ఈ పిక్ ను షేర్ చేసింది.

Sreeja Kalyan in Yellow patola saree ! | Fashionworldhub

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు మొదలైపోయాయి. చిరంజీవి ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న “ఆచార్య” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. “లూసిఫర్”, “వేదాళం” రీమేక్‌ లలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. రేపు చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మెగా అభినులను సర్ప్రైజ్ చేయబోతున్నాయి.

 

Related posts