హైదరాబాద్: ఆరు కాదు.. నా తల 10 ముక్కలు నరుకు అంటూ సీఎం కేసీఆర్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతి సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో.. గత మూడు రోజుల నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం తారాస్థాయికి చేరుతోంది. ధాన్యం కొనుగోలు అంశంపై మొదలైన ఈ మాటల వివాదం, చినికి చినికి గాలివానలా మారుతోంది.
చాలా నెలల తర్వాత ఇటు సీఎం కేసీఆర్, అటు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ ఒకరిపైనొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. గత మూడు రోజులుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది.
సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా బండి సంజయ్, బండి సంజయ్ వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇరువురి మాటల యుద్ధమే హాట్‌టాపిక్‌గా మారింది.
తన తల 6 ముక్కలు కాదు 10 ముక్కలుగా నరుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తన తల నరికిన పర్వాలేదని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ డేట్ చెప్తే ప్రగతి భవన్ కు వచ్చి, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తన తల నరికించుకుంటానని ప్రతి సవాల్ విసిరారు. హుజురాబాద్ ఫలితం నేపధ్యంలో సీఎం కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. దళితుడికి తెలంగాణలో సీఎం అయ్యే అవకాశం, అర్హత లేదా ? అని ప్రశ్నించారు.
మరోవైపు 24 రాష్ట్రాలు పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాయి ? తెలంగాణలో కేసీఆర్ తగ్గించరా ? అని నిలదీశారు. పెట్రోల్ ధరలు తగ్గించకపోతే డప్పుల మోత ఇక ఆగదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు బండి సంజయ్.
పెద్దమ్మ గుడిలో వీహెచ్.. ప్రమాణానికి రాని కేటీఆర్!