లాక్‌డౌన్ విరామంలో ఆన్‌లైన్ ద్వారా నటనలో శిక్షణ తీసుకుంటూ బిజీగా ఉంది ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్. ప్రభుత్వ సూచనల్ని పాటిస్తూ ఇంటికే పరిమితమైన ఆమె పీఏం కేర్స్, సీఏం రిలీఫ్ ఫండ్‌తో పాటు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సీసీసీకి విరాళాన్ని అందజేసింది. అలాగే వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్, స్ఫూర్తి సంక్షేమ సంఘానికి సహాయాన్ని చేసినట్లు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం నిధి తెలుగులో అశోక్ గల్లా సరసన ఓ చిత్రం తమిళంలో జయం రవి సరసన భూమి అనే చిత్రం చేస్తుంది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ వలన ఇంటికే పరిమితమైన నిధి అగర్వాల్ తన ట్యాబ్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిధి తన మొబైల్ లో పబ్ జీ గేమ్‌కి సంబంధించిన వీడియోని ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ “అండ్ ఇట్ బిగిన్స్” అంటూ ట్వీట్ చేసింది. ఈ విషయం నెటిజన్లకు తెలియగానే ఆనందంలో మునిగిపోయారు. కొందరు పబ్ జీ ప్రేమికులు నిధిని పబ్జీ ఐడీ ఇవ్వమని… మీతో ఆడతామని కోరారు. ఇటీవలి కాలంలో యువతని బాగా ఆకట్టుకున్న గేమ్ పబ్‌జీ. ఈ గేమ్ మాయలో పడి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. దీనికి దూరంగా ఉండాలని పలువురు ప్రముఖులు కూడా హెచ్చరించారు.