telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మేకప్ మెన్ దగ్గర అప్పు చేసిన నటి… సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్

Sonal

ఒక న‌టి నిర్మాత‌లు డ‌బ్బులివ్వ‌క పోవ‌డంతో మేక‌ప్ మ్యాన్ ద‌గ్గ‌ర అప్పు తీసుకుందట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమే వెల్ల‌డించింది. టెలివిజన్ నటి సోనాల్ వెంగర్లేకర్ ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో న‌టిస్తుంది. లాక్ డౌన్ వలన ఈ రెండు నెలల్లో తన వద్ద ఉన్న మనీ మొత్తం అయిపోయింద‌ట‌. ఈ స‌మ‌యంలో తనకు రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన నిర్మాత ఒకరికి కాల్ చేసి డబ్బులడగగా అతను మొహం చాటేసాడని అంటుంది. ఆతర్వాత వరుసగా కాల్ చేస్తుండటం తో అతడు నెంబర్ బ్లాక్ చేసాడట. చేసేదేం లేక మేకప్ మ్యాన్ తో తన సమస్యను వివరించిందట. సోనాల్ ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న పంక‌జ్ గుప్తా అనే మేక‌ప్ మ్యాన్ త‌న భార్య డెలివ‌రీ ఖ‌ర్చు కోసం రూ.15 వేలు దాచాడ‌ట‌. దానిని సోనాల్‌కి ఇచ్చి డెలివ‌రీ స‌మ‌యానికి డబ్బు ఇవ్వాల‌ని కోరిన‌ట్టు తెలుస్తుంది. మేకప్ మ్యాన్ మంచితనాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యానని సోనాల్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ ను పెట్టింది.

Related posts