telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

అతిగా కారం తింటే.. ఏమవుతుందో తెలుసా!

వంటకాలకు విదేశీయుల వంటకాల ప్రధాన తేడా.. కారం. మన వంటకాల్లో మనం కారం కాస్త ఎక్కువగానే తింటుంటాం. అయితే.. అందరికీ కారం ఎక్కువగా తీసుకునే అలవాటు ఉండదు. అయితే.. కారం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే వంటల్లో ఇంకొంచెం కారం వాడే అవకాశం ఉంది. మిరపకాయలు తినడం వల్ల కొన్ని వ్యాధులు దూరం అవుతాయట. పరిశోధకుల ప్రకారం కారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి.
కారం తినడం వల్ల బరువు సమస్య ఉండదు
పండు మిరపకాయను తమ ఆహారంలో భాగం చేసుకుంటే దీర్ఘాయుష్షు కలుగుతుందట. వారికి అనారోగ్యం కలిగే అవకాశం తక్కువట.
కారం తక్కువగా తీసుకునే వాళ్లకు రోగాల నుంచి తప్పించుకోవడం కాస్త కష్టం అంట.
మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్‌, డీహైడ్రోక్యాప్సైసిన్‌ వల్ల రక్తంలో చక్కర శాతం, గ్లూకోజ్‌ శాతం అదుపులో ఉంటుంది.
శరీరంలో ఇన్యూలిన్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. దీని వల్ల ధమనుల్లో ఉన్న అధిక కొవ్వు తొలుగుతుంది.

Related posts