telugu navyamedia
సినిమా వార్తలు

డైలామాలో టక్ జగదీష్..!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రీతు వర్మ, ఐశ్యర్య రాజేష్ హీరోయిన్లుగా టక్ జగదీష్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను థియేటర్లలో విడుద‌ల చేయాలా? ఓటీటీలో విడుద‌ల చెయ్యలనే డైలామాలో ప‌డ్డారంట‌.? ఇందులో భాగంగానే అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చినట్లు స‌మాచారం. ఓటీటీ విడదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో టక్ జగదీష్ అతి త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందని టాక్ న‌డుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం అంద‌లేదు

కాగా ..ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది.ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే కోవిడ్ కారణంగా ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకున్నాయి.

కరోనా కేసులు తగ్గినా.. థియేటర్లలో జనాలు సినిమా చూసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేక‌పోవ‌డంతో నిర్మాతలలో సరికొత్త సందేహం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా థర్డ్ వేవ్ మొదలైందనే వార్తలు జోరందుకోవడంతో ఏ పరిస్థితుల్లోనైనా థియేటర్లు మళ్లీ మూతపడే అవకాశం కనిపిస్తుంది.

ఇప్పుడున్న పరిస్థితులలో తమ చిత్రాలను థియేటర్లలో కంటే ఓటీటీలోనే విడుదల చేస్తే.. మూవీ బడ్జెట్ అయినా వస్తుందని, విడుదల ప్రయత్నాలు జ‌రుగుతున్నారంట‌. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లుగా సమాచారం.

Related posts