telugu navyamedia
ఆరోగ్యం

క‌రివేపాకుతో లాభాలు..!

క‌రివేపాకు గురించి తెలియ‌న‌వాళ్ళు ఎవ‌రూ ఉండ‌రు. దీని సువాస‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. క‌రివేపాకు వండే వంట‌ల్లో వేస్తే దాని రుచి వేరేగుంటుంది . రుచితో పాటు మంచి ఔష‌దంలా కూడా ప‌నిచేస్తుంది. క‌రివేపాకు ప్ర‌తిరోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా ఆహారంలో స్వీక‌రిస్తే మూత్ర‌సంబంధిత వ్యాధులు తొలిగిపోతాయి. ఒత్తిడి త‌గ్గి మెద‌డ‌కు కాల్షిష‌యం స‌ర‌ఫ‌రా చేసి మ‌నుసును ఎంతో హాయిగా ఉంచుతుంది.

అలాగే వేవిళ్ల‌తో బాధ‌ప‌డే గ‌ర్భిణీలు క‌రివేపాకుల ర‌సం తీసుకుని దాంట్లో నిమ్మ‌కాయ ర‌సం స్పూన్‌, తేనే అర‌స్పూన్‌ వేసి తాగితే వేవిళ్లు త‌గ్గుతాయి. అంతేకాదు నోటి పూత‌తో బాధ‌ప‌డేవారు పొద్దున్నే క‌రివేపాకు ఆకులు న‌మిలిలితే త్వ‌ర‌లో నోటిపూత త‌గ్గుముఖం ప‌డుతుంది. అలాగే వేడి కొబ్బ‌రి నూనెలో క‌రివేపాకు వేసి బాగా మ‌రిగించి రోజూ ఆనూనె త‌ల‌కు రాసుకుంటే క్ర‌మక్ర‌మంగా జుట్టు న‌ల్ల‌బ‌డ‌డం, రాల‌డం త‌గ్గుతుంద‌ట‌.

రెండు క‌ప్పుల క‌రివేపాకును తీసుకుని పేస్ట్‌లా మెత్త‌గా రుబ్బుకొని, ఈ పేస్ట్‌లో అర‌క‌ప్పు పెరుగు వేసి క‌ల‌పాలి. ఇది జ‌ట్టు కుదుళ్ళు నుంచి చివ‌రి వ‌ర‌కు ప‌ట్టించిన గంట త‌రువాత‌ త‌ల‌కు స్నానం చేస్తే మంచింది.ఇందులో విటిమిన్ ఇ, ప్రొటిన్స్, కాల్షియం, ఐర‌న్‌ పుష్క‌లంగా ఉండ‌డంతో జుట్టు రాల‌డం త‌గ్గి, కుదుళ్ళు దృడంగా త‌యార‌వుతాయి. అంతేకాదు వారానికి ఒక‌సారి ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Related posts