టాలీవుడ్ చాక్లెట్ బోయ్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ పోతినేని అరుదైన రికార్డును అందుకున్నారు. రామ్‌కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తరాదిలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ విషయాన్ని ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా రుజువు చేసింది. రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా వచ్చిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ డిజిటల్ రైట్స్‌ను ఆదిత్య మూవీస్ సంస్థ కొనుగోలు చేసింది. హిందీలో ‘దుందార్ ఖిలాడీ’గా అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో ఈ సినిమాను యూట్యూబ్‌లో విడుదల చేయగా ఇప్పటి వరకు 140 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో అతివేగంగా 1 మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకున్న ఏకైక సౌతిండియన్ సినిమాగా ‘దుందార్ ఖిలాడీ’ నిలిచింది. రామ్ కెరీర్‌లో ఎన్నో వీడియో సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. అందులో ‘నేను శైలజ’ సాంగ్ 100 మిలియన్‌ల వ్యూస్‌ని అందుకోగా, ఆ సినిమా హిందీ వర్షన్ 140 మిలియన్ల వ్యూస్‌ని దాటేసింది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ హిందీ డబ్బింగ్ వర్షన్ ‘నెంబర్ 1 దిల్ వాలా’ కూడా 1 మిలియన్ లైక్స్‌కి అతి దగ్గరలో ఉంది. ‘హైపర్’, ‘శివమ్’ సినిమాలు కూడా హిందీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
previous post