telugu navyamedia
సినిమా వార్తలు

“మా ” ఎన్నికల్లో గెలుపెవరిది ?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 10న హైదరాబాద్ లోని జూబిలీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో జరగబోతున్నాయి. “మా ” అధ్యక్ష పదవి కోసం నటుడు ప్రకాష్ రాజ్ , హీరో మంచు విష్ణు పోటీపడుతున్నారు. ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు . మంచు విష్ణుకు మోహన్ బాబు తో పాటు హీరో కృష్ణ , నరేష్ మద్దతు తెలిపారు.

అటు ప్రకాష్ రాజ్ కోసం మెగాస్టార్ చిరంజీవి, ఇటు మంచువిష్ణు కోసం ఆయన తండ్రి మోహన్ బాబు సినిమా నటీనటుల మద్దతు కూడ కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రెండు గ్రూపుల ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ తన గ్రూప్ తో పాటు నటి నటుల ఇళ్లకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారట . ఇలా వెళ్ళినప్పుడు చిన్న నటి నటులు తమ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు చెబుతుంటే వెంటనే వారి సమస్యలు పరిస్కరిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక మంచు విష్ణు తన తండ్రితో పాటు నగరంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో మకాం వేసి, అక్కడికి నటీనటులను పార్టీలకు ఆహ్వానిస్తున్నారని, మోహన్ బాబు నటీనటులకు స్వయంగా ఫోన్ చేసి తన బిడ్డ విష్ణు ను ఆశీర్వదించమని అడుగుతున్నట్టు తెలుస్తుంది. రెండు గ్రూపులు డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెడుతున్నారని, గెలుపే ప్రధానంగా అన్ని రకాలుగా తమ శక్తి యుక్తులను ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. “మా ” ఎన్నికలు రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నాయి. గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

 

Related posts