telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వీడు కొట్టినా చూడొచ్చు కొటేషన్ మాత్రం వినలేం… “భీష్మ” ట్రైలర్

bheeshma

యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా.. ‘ఛలో’ మూవీతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరి ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).. సోమవారం సాయంత్రం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.పురాణాల్లో ఎన్నో పేర్లుండగా ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారని నితిన్ ఆవేదన చెందడంతో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సేంద్రీయ వ్యవసాయం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. నితిన్, రష్మికల కెమిస్ట్రీ, డైలాగ్స్, కామెడీ టైమింగ్, విజువల్స్, ఆర్ఆర్ ట్రైలర్‌లో హైలెట్ నిలిచాయి. తాజాగా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ టీమ్ ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న ‘భీష్మ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

;

Related posts