telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రేమించి పెద్ద నేరం ఏమీ చేయలేదు… నా భర్తే ముఖ్యం : కరీనా కపూర్

Kareena-Kapoor

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ‘రెఫ్యూజీ’ సినిమాతో కరీనా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సహ నటుడు షాహిద్ కపూర్ తో చాలా కాలం డేటింగ్‌లో ఉంది క‌రీనా. మనస్పర్ధలు రావడంతో వీరు విడిపోయారు. కొన్నాళ్ల‌ తర్వాత కరీనా… సైఫ్ అలీ ఖాన్‌‌తో బంధం ఏర్పడింది. సైఫ్, కరీనా 2012లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి 2016లో తైమూర్ పుట్టాడు. పెళ్లి తరువాత అవకాశాలపై తాజాగా స్పందించారు కరీనా. “నేను సైఫ్‌ని ప్రేమించి పెద్ద నేరం ఏమీ చేయలేదు. నా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు నేను సైఫ్‌ని పెళ్లి చేసుకున్నాను. నాకు పెళ్లైందని నాతో పనిచేయడం ఇష్టం లేకపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. పెళ్లి చేసుకుంటున్నానని చాలా మంది నా కెరీర్ అయిపోయింది అని భయపెట్టారు. అయినా ఏం ఫర్వాలేదు… కానీ నేను జీవితాంతం సైఫ్‌తో సంతోషంగా ఉంటాను అనిపించి అతన్ని పెళ్లి చేసుకున్నాను. నా జీవితంలో నేను తీసుకున్న బెస్ట్ నిర్ణయం సైఫ్‌ని పెళ్లి చేసుకోవడమే. నేను సైఫ్ అలీ ఖాన్‌తో ప్రేమలో ఉన్నట్లు ముందు నా స్నేహితుడైన అక్షయ్ కుమార్‌కే చెప్పాను. అక్షయ్ నాకు చాలా విలువ ఇస్తాడు. అందుకే నా ప్రేమ విషయం అతనికి తెలిసినా ఎవ్వరికీ చెప్పలేదు. నేను, అక్షయ్, సైఫ్ ‘టషన్’ సినిమాలో నటించాం. అదే సమయంలో నేను, సైఫ్ ప్రేమించుకున్నాం. నేను తైమూర్‌ని కన్నాక సినిమాలు చేయడం కాస్త కష్టమైంది. ఎందుకంటే నేను కనిపించకపోతే వాడు ఏడుస్తాడు. పిల్లాడు పుట్టాక కూడా సినిమాలు చేయడానికి సైఫ్ ఒప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు. షూటింగ్‌కి తైమూర్‌కి కూడా వెంటబెట్టుకుని వెళ్లమన్నాడు. అప్పుడు వాడు తల్లికి దూరంగా ఉండటం లేదు అని తెలుస్తుందని చెప్పాడు. దాంతో నేను షూటింగ్‌కి వెళ్లేటప్పుడు తైమూర్‌ని తీసుకెళ్లాను. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోసం 20 రోజులు పంజాబ్‌లో ఉండాల్సి వచ్చింది. దాంతో తైమూర్‌ని కూడా తీసుకెళ్లాను. ఎనిమిది గంటలు షూటింగ్‌లో పాల్గొని హోటల్ రూంకి వెళ్లి తైమూర్‌ని నిద్రపుచ్చేదాన్ని. వర్కింగ్ మదర్, వర్కింగ్ యాక్టర్ అంటే అలా ఉండాలి” అంటూ చెప్పుకొచ్చింది బెబో.

Related posts