telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిత్ర పరిశ్రమలో మరో విషాదం : సంగీత దిగ్గజం మృతి

2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు వనరాజ్ భాటియా (94) వయోభారంతో ముంబైలో శుక్రవారం కన్నుమూశారు. 1927లో ముంబైలో జన్మించిన వనరాజ్ భాటియా… లండన్ రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఢిల్లిలో కొంతకాలంగా మ్యూజికాలజిస్ట్ గా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ప్రోత్సాహంతో చిత్రసీమలోకి వనరాజ్ భాటియా అడుగుపెట్టారు. 1974లో శ్యామ్ బెనగల్ తొలి చిత్రం ‘అంకుర్’తో మొదలైన వారి అనుబంధం సుదీర్ఘ కాలం సాగింది. శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన దాదాపు 16 చిత్రాలకు వనరాజ్ సంగీతాన్ని సమకూర్చారు. వెస్ట్రన్ మ్యూజిక్ అభ్యసించినా భారతీయ సంప్రదాయ, జానపద సంగీతాన్ని అధ్యయనం చేసి ఇక్కడి చిత్రాలలోని సన్నివేశాలకు తన సంగీతంతో ప్రాణం పోశారు. ఇక ఆయన మృతి పట్ల పలుగురు సంతాపం తెలిపారు.

Related posts