telugu navyamedia
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో బాలయ్య, వెంకీ ?

Venkatesh

సాధారణంగా స్టార్ హీరోలు నటించే భారీ సినిమాలన్నీ సంక్రాంతి బరిలో దిగుతుంటాయి. ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంటుంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి “సరిలేరు నీకెవ్వరు”, “అల వైకుంఠపురములో”, “దర్బార్” వంటి భారీ సినిమాలు పోటాపోటీగా విడుదల కాబోతున్నాయి. అంతకు మించిన పోటీ ఈ ఏడాది డిసెంబర్‌లో నెలకొంది. ఇప్పటికే రవితేజ “డిస్కోరాజా”, నితిన్‌ “భీష్మ”, శర్వానంద్ “96”, సాయిధరమ్ “ప్రతీరోజు పండగే” వంటి సినిమాలు డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కూడా డిసెంబర్ బరిలోకి దిగబోతున్నారట. దసరా సందర్భంగా విడుదల చేయాలనుకున్న “వెంకీ మామ” దీపావళికి వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం దీపావళికి కాకుండా డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాలని “వెంకీ మామ” డిసైడ్ అయ్యాడట. మరోవైపు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా కూడా డిసెంబర్ టార్గెట్‌గానే రెడీ అవుతోందట. సంక్రాంతి బరిలోకి దిగే ఛాన్స్ లేదు కాబట్టి, వచ్చే వేసవి వరకు మంచి రిలీజ్ డేట్ లేదు కాబట్టి సినిమాలన్నీ డిసెంబర్ బరిలోకే దిగుతున్నాయి.

Related posts