నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అంటే.. సుందరానికి’ . ఈ సినిమా ఈ నెల 10వ తేదీన తెలుగుతో పాటు తమిళం, మళయాళం భాషల్లో విడుదలకు సిద్ధమైంది.
జూన్ 10న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌లో నాని లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. బ్రాహ్మణ యువకుడిగా నాని కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో నటి నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తున్నారు. రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషింస్తున్నారు.
మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ తమిళంలో ‘అడడే సుందరా’ పేరుతో విడుదల కానుంది. ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు.
హీరో నాని మాట్లాడుతూ ఈ చిత్రం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్యామ్ సింగరాయ్ వంటి యాక్షన్ కథా చిత్రం తరువాత వినోదంతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం సముచితంగా అనిపించిందని తెలిపారు.
ఈ మూవీ చాలా సంతృప్తికరంగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని నటి నజ్రియా నజీమ్ పేర్కొన్నారు.