మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మూవీ ‘మగధీర’తో టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. మెగాస్టార్ తనయుడిగా
తాజాగా రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరరాస్తున్నాడు రామ్ చరణ్. “ఆర్ఆర్ఆర్”ను బ్లాక్ బస్టర్ హిట్ చేసి చెర్రీకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు ప్రేక్షకులు.
ఈ నేపథ్యంలో అభిమానులకు , సినీప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు చరణ్. “”రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పట్ల మీరు చూపిస్తున్న అసమాన ప్రేమ, ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎంతో ఉత్సాహంగా ఈ సినిమా చూసిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని పుట్టినరోజు నా బహుమతిగా బాధ్యతతో స్వీకరిస్తాను.” అని చరణ్ ట్వీట్ చేశారు.